రాష్ట్రంలో బీజేపీ ఎన్ని వేషాలు వేసినా సాగవు : డాక్టర్ గువ్వల బాలరాజు

by Disha Web Desk 20 |
రాష్ట్రంలో బీజేపీ ఎన్ని వేషాలు వేసినా సాగవు : డాక్టర్ గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట : న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉందని, అలాంటి నమ్మకాన్ని న్యాయవ్యవస్థ ఎప్పుడూ ఒమ్ము కానివ్వదని న్యాయవ్యవస్థ ఎలాంటి ప్రలోభాలకు భయపడదని ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ చీప్ బండి సంజయ్ ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కోర్టు జైలుకు పంపిన విషయం పై ఆయన స్పందించారు. గురువారం అమ్రాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని కులం, మతం పేరుతో రాజకీయాలే లక్ష్యంగా బీజేపీ నిలదొక్కుకోవాలనుకోవడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎన్ని వేషాలు వేసిన గాని కుట్రలు బహిర్గతం అవుతూనే ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. మోడీ చెప్పులు మోసే బండి సంజయ్ నేడు జైలు ఊసలు లెక్కబెడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

నేడు మహావీర్ జయంతి వేడుకలు ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ఉత్సవాలు ఎవరివైనా వాటిని ప్రజాస్వామ్య దేశంలో గౌరవించాలన్నారు. పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ రాష్ట్రంలో విద్యావ్యవస్థ పట్టించేలా కుట్రలు పూనిందని అలాంటి సమయంలోనే సమస్యలు సద్దుమనే విధంగా బీఆర్ఎస్ క్యాడర్ సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవమే లక్ష్యంగా రాష్ట్రం ఏర్పడిందని లీకు వీరులను కార్యకర్తలు నాయకులు ఒక కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అచ్చంపేట పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ముందు రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షు కార్యదర్శులు రవీందర్ రెడ్డి, జానయ్య, జిల్లా నాయకులు చెన్నకేశవులు, సర్పంచులు శ్రీరాం నాయక్, శారద శ్రీనివాస్, పెద్దిరాజు, రైతు సమావేశం అధ్యక్షుడు రాజారాం గౌడ్, రవికుమార్, శ్రీనివాసులు, జావిద్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed