కంప్యూటర్​ ఆపరేటర్​ చేతివాటం...గ్రామ పంచాయతీల నిధులు స్వాహా.!

by Disha Web Desk 15 |
కంప్యూటర్​ ఆపరేటర్​ చేతివాటం...గ్రామ పంచాయతీల నిధులు స్వాహా.!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ / కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి 15వ ఫైనాన్సు నుండి విడుదలైన సుమారు రూ.18.5 లక్షల నిధులను కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ సింగ్ తన సొంత బ్యాంక్ అకౌంట్ లోకి మళ్లించాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆయా గ్రామ పంచయతీ సర్పంచులు మండల అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని 16 గ్రామపంచాయతీలకు 15వ ఫైనాన్స్ నిధులు విడుదల కాగా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఈ ఓఆర్డీఓ విభాగంలోని కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ సింగ్ తన సొంత ఖాతాలోకి రూ.18,34, 635 నగదును బదిలీ చేసుకున్నారు.

కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండా గ్రామపంచాయతీకి చెందిన 35వేలు, ఏలూరు గ్రామ పంచాయతీకి చెందిన నాలుగు లక్షల 50 వేల 300 లను, చింతలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 1,39,950 లు, జావాయిపల్లికి చెందిన ఒక లక్ష 33 వేల 88 రూపాయలను, అంకిరావుపల్లి గ్రామపంచాయతీకి చెందిన 98,500 రూపాయలను, ఎన్మంబెట్ల గ్రామపంచాయతీకి చెందిన 1,27,800 రూపాయలను, ముక్కిడిగుండం గ్రామపంచాయతీ చెందిన 45 ,9 00 రూపాయలను, రామాపూర్ గ్రామానికి చెందిన 97,820 రూపాయలను, సింగపట్నం గ్రామపంచాయతీ చెందిన 13,000 రూపాయలను, మాచినేనిపల్లి గ్రామానికి చెందిన 26,500 రూపాయలను, లచ్చ నాయక్ తండాకి చెందిన 74,500 రూపాయలను, కుడికిళ్ల గ్రామ పంచాయతీకి చెందిన 3,70,000 రూపాయలను సునీల్ సింగ్ స్వాహా చేశాడు. ఈ విషయం తెలిసిన వివిధ గ్రామాల సర్పంచులు గురువారం కొల్లాపూర్ పట్టణం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. సర్పంచుల ఫిర్యాదు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు, జిల్లా పంచాయతీ శాఖ అధికారులకు కొల్లాపూర్ మండల ఈపీఆర్డీఓ మనోహర్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed