సూర్య ఘర్ యోజన తో ఉచిత విద్యుత్‌, అదనపు ఆదాయం

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల ప‌రిధిలోని పెద్దదగడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

సూర్య ఘర్ యోజన తో ఉచిత విద్యుత్‌, అదనపు ఆదాయం
X

దిశ, చిన్నంబావి : మండ‌ల ప‌రిధిలోని పెద్దదగడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా గ్రామీణ కుటుంబాలు విద్యుత్ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామంలో ఉన్న 630 కుటుంబాల్లో 469 కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాలు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని, సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహ అవసరాలకు వినియోగించు కోవడంతో పాటు, మిగులు విద్యుత్‌ ను విద్యుత్ సంస్థలకు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చని మంత్రి జూపల్లి తెలిపారు.

ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.2.50 చొప్పున చెల్లింపులు అందే అవకాశం ఉందని, పర్యావరణ పరిరక్షణ తో పాటు కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో ఈ పథకం కీలకంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని స్వయం విద్యుత్ ఉత్పత్తి దారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలోని పాఠశాల ను పరిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యుత్ శాఖ రాష్ట్ర డీజీఎం భాస్క‌ర్ రెడ్డి, స‌ర్పంచ్ భాస్క‌ర్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ జడ్పీటీసీ కృష్ణ ప్రసాద్ యాదవ్, సీనియర్ నాయకులు బిచుపల్లి యాదవ్, విద్యుత్ శాఖ అధికారులు, పాల్గొన్నారు.

Next Story