రేపటి నుంచి ఉచిత కోచింగ్ ప్రారంభం

by Kalyani |   ( Updated:2025-04-15 15:45:00.0  )
రేపటి నుంచి ఉచిత కోచింగ్ ప్రారంభం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, వీఆర్ఏ, టెట్, డీఎస్సీ తదితర గ్రూప్ పరీక్షలకు హైదరాబాద్ ఫ్యాకల్టీ వారిచే స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నట్లు పర్యవేక్షకులు గుండా మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. కోచింగ్ తీసుకుంటున్న వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ను కూడా అందిస్తామని, ఇందుకు సంబంధించిన ఇతర సమాచారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఫోన్ నెంబర్లు 7989099197, 8639260193 లకు కాల్ చేయవచ్చు అని ఆయన తెలిపారు



Next Story

Most Viewed

    null