పాలమూర్‌లో బీజేపీ గెలుపు ఖాయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Vinod kumar |
పాలమూర్‌లో బీజేపీ గెలుపు ఖాయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్: పాలమూరులో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, హన్వాడ మండల కేంద్రాల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలతో ఆయన సమావేశాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారంతో అరాచకాలు చేస్తున్నాడని, కబ్జాలతో పాలమూరును ఆక్రమించుకుంటున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. మంత్రి పదవి శాశ్వతం అనుకుని పాలన కొనసాగిస్తున్నారని, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, పార్టీ మారకపోతే కేసులు పెట్టి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికార దుర్వినియోగం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణ గా మారిందన్నారు.

టీఆర్ఎస్ పట్ల ప్రజలలో నమ్మకం కోల్పోయింది.. బీఆర్ఎస్ అనే కొత్త పదాన్ని తెరమీదకి తెచ్చాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరు నియోజకవర్గానికి ప్రాధాన్యతనిచ్చి పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంటు ప్రబారి చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జి భరత్ గౌడ్, అధ్యక్షులు వీర బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు సత్యం, అసెంబ్లీ కన్వీనర్ అంజయ్య బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఎన్.పి వెంకటేష్, జయశ్రీ, రాజు గౌడ్, వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story