స్ప్రింగ్ ఆపరేషన్ చేపడుతున్న అటవీశాఖ

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం రాయల్ గండి తండాలో కొందరు వ్యక్తుల వద్ద చిరుత పులి గోర్లు ఉన్న విషయం అటవీశాఖ అధికారులకు పక్క సమాచారం అందడంతో గత కొద్ది రోజులుగా ఆపరేషన్ చేపట్టారు.

స్ప్రింగ్ ఆపరేషన్ చేపడుతున్న అటవీశాఖ
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం రాయల్ గండి తండాలో కొందరు వ్యక్తుల వద్ద చిరుత పులి గోర్లు ఉన్న విషయం అటవీశాఖ అధికారులకు పక్క సమాచారం అందడంతో గత కొద్ది రోజులుగా ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రాయల గండి తండాలో సోదాల నిర్వహించిన అటవీ శాఖ అధికారులకు కొందరు వ్యక్తుల నుంచి దాదాపు 7 చిరుత పులి గోర్లు లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై అటవీశాఖ అధికారులు లోతైన అధ్యయనం చేపడుతూ.. మరికొంతమందిని త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ముగ్గురు వ్యక్తులను రాత్రి అదుపులోకి తీసుకొని విచారణ వేగవంతం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం.. నిందితులను కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉన్నది. పూర్తి వివరాలను అటవీశాఖ అధికారులు మీడియాకు తెలిపనున్న‌ట్టు స‌మాచారం.

Next Story