రాయచూర్‌లో బీఆర్ఎస్‌ను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు

by Disha Web |
రాయచూర్‌లో బీఆర్ఎస్‌ను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్: భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్) ఏర్పాటును స్వాగతిస్తూ కర్ణాటకలోని రాయచూర్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిత్రాలతో రూపొందిన హోర్డింగులు రాయచూర్‌తో పాటు, తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో ఉన్న పలు ప్రాంతాలలో వెలిసాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు వీలుగ బీఆర్ఎస్‌ను ప్రకటించిన నేపథ్యంలో హోర్డింగ్‌లను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ హోర్డింగ్‌లను రాయచూర్‌లో కౌన్సిలర్లుగా, రాజకీయం గాను పలుకుబడి ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed