- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు అప్రమత్తంగా ఉండాలి : డీఏఓ
ప్రస్తుత వానాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.యశ్వంత్ రావు సూచించారు.

దిశ, కందనూల్ : ప్రస్తుత వానాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.యశ్వంత్ రావు సూచించారు. జూన్ నెలలో వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నందున రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని, తగినంత వర్షం పడిన తర్వాతే విత్తనాలు వేయాలని ఆయన స్పష్టం చేశారు. కరువును తట్టుకునే పంటలపై దృష్టి పెట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు స్వల్పకాలిక, కరువును తట్టుకునే వంగడాలను ఎంచుకోవాలని సూచించారు. వరి సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలను దశలవారీగా ఏర్పాటు చేసుకుని, నీటి లభ్యతను బట్టి సాగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రత్యామ్నాయంగా అలసంద, పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్య పంటలను సాగు చేసి, ఉన్న నేల తేమను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు.
ధృవీకరించిన విత్తనాలే కొనాలి
రైతులు ధృవీకరణ పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు మెళకువలపై సలహాల కోసం మండల వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, శాఖ సూచనలు పాటిస్తే పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది.






