జూరాల వద్ద.. రైతుల ఆందోళన

by Sumithra |
జూరాల వద్ద.. రైతుల ఆందోళన
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : యాసంగిలో సాగు చేసిన తమ పంట పొలాలకు సాగునీరు అందక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతులు పెద్ద ఎత్తున జూరాలకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. జూరాల ఎడమ కాలువ కింద రేచింతల, వీర రాఘవపురం, ఆరేపల్లి, కత్తెపల్లి, తూంపల్లి గ్రామాల పరిధిలో ఎనిమిది వేల ఎకరాలకు పైగా పొలాల్లో వరి తదితర పంటలను సాగు చేశారు. జూరాలలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రైతులు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రైతులు ఒక్కసారిగా జూరాలకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story