స్వేరో నాయకులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలి

by Naveena |
స్వేరో నాయకులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలి
X

దిశ,నాగర్ కర్నూల్ టౌన్ : గత కొద్ది రోజుల క్రితం తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అస్వస్థత గురయ్యారని సమాచారంతో వెళ్లిన స్వేరో నాయకులపై తప్పుడు కేసు వేశారని నాగర్ కర్నూల్ జిల్లా స్వేరోస్ నాయకులు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా నాయకులు మీదింటి సురేందర్ మాట్లాడుతూ.. స్వేరో నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రష్మీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన వసతులు కల్పించమని అడిగిన నాగర్ కర్నూలు జిల్లా స్వేరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ పై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు?ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ మిద్దె ధర్మరాజు మాట్లాడుతూ..రాజకీయ కుట్రతోనే శివశంకర్ పై తప్పుడు కేసు నమోదు చేశారని తెలియజేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలకపల్లి మండలంలో 12 మంది పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పేరుతో బదిలీ చేసిన విషయాన్ని లేవనెత్తినందుకు,ఇటువంటి కేసులను స్వేరోస్ పై బనయించి,నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.ప్రజల పక్షాన నిలబడ్డ స్వేరోస్ నాయకులపై ఉన్న తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్, ఉపాధ్యక్షులు వడ్డేమాన్ మోహన్, కోశాధికారి బొల్లె రమేష్,కృష్ణ,సంపత్ కుమార్, మల్లేష్,రాము, కాశీం, రాజు, వీరస్వామి, రమేష్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story