బెల్టు షాపులో నకిలీ నోట్ల హల్ చల్..

by Disha web |
బెల్టు షాపులో నకిలీ నోట్ల హల్ చల్..
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో ఉన్న కటిక శేఖర్ బెల్ట్ షాపులో బిజినపల్లికి చెందిన ఓ యువకుడు అతని బెల్ట్ షాపులో మద్యం తీసుకొని రూ. 2000 వేల నోటును ఇచ్చి మిగతా చిల్లర తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు బెల్ట్ షాపులో నిర్వాహకుని తల్లి ఉండడంతో రూ. 2000 నోటును సరిగా గుర్తించలేకపోయారు. కొంతసేపటి తర్వాత బెల్ట్ షాపు నిర్వాహకుడు కటిక శేఖర్ వచ్చి ఆ రూ. 2000 నోటును చూస్తే అది కొద్దిగా తేడాగా కనిపించింది. వెంటనే ఆ నోటు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటూ అతను తల్లిని అడగగా బిజినేపల్లి నుంచి ఓ బైకుపై ముగ్గురు యువకులు వచ్చారని చెప్పడంతో వెంటనే ఆ నిర్వాహకుడు ఆ ముగ్గురు యువకులు ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టాడు.

బిజినేపల్లికి చెందిన ఓ యువకుడని తెలియడంతో పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చాడని తెలిసింది . పోలీసులు వెంటనే పాలెం గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుని వద్దకు వచ్చి ఆ నోటును తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నకిలీ నోటు ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకపోయినట్లు సమాచారం. దీనిపై పోలీసులను దిశ వివరణ కోరగా బెల్ట్ షాపు నిర్వాహకుడు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు.


Next Story