- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రతి ఒక్కరికీ కంటి వైద్య పరీక్షలు చేపట్టాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
దిశ, ప్రతినిధి నారాయణపేట: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి వైద్య పరీక్షలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. బుదవారం ఉదయం జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కంటి వెలుగు కు సంబంధించిన రిజిస్టర్లను ఆయన పరిశీలించి జిల్లాకు వచ్చిన మొత్తం కంటి అద్దాలు ఎన్ని? ఇప్పటి వరకు పంపిణీ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఆసుపత్రి సుపరింటెండెంట్ తో కలిసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రహరీ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం లో నిర్మిస్తున్న మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరగా పుర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డీఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బంది వివరాలు ఎంతమంది విధులకు హాజరయ్యారు అంటూ అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి రాంమనోహర్ రావు, ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంజిత్, ముసినిపల్ ఏఈ మహేష్ ఉన్నారు.
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను నారాయణపేట జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో 7,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఈవో లియాఖత్ అలీ, జిల్లా వైద్యాధికారి రాంమనోహర్ రావు, డీటీవో యాదగిరి, ఆర్డీవో వీరస్వామి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు