ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే విజయుడు

by Kalyani |
ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే విజయుడు
X

దిశ, రాజోలి : మండల కేంద్రంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం పోరాడుతున్న రైతులకు అండగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ… పచ్చని పొలాల మధ్య విషాన్ని చిమ్మే ఫ్యాక్టరీలను ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం జరిగితే ఇక్కడ ఉన్న వేల ఎకరాల భూములు ఎడారులుగా మారే అవకాశం ఉందని, కూతవేటు దూరంలో ఉన్న తుంగభద్ర నది కలుషితం అవుతుందని, ప్రజలు కూడా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఫ్యాక్టరీ రద్దు కొరకు ఫ్యాక్స్ ద్వారా సీఎం కు లేఖను పంపుతామని,ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు విషయం పై అసెంబ్లీ లో గళం విప్పుతనని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed