ఒక్కొక్కరు వచ్చారు... ఒకరిని చూసి ఒకరు వెళ్లిపోయారు...

by Disha Web Desk 11 |
ఒక్కొక్కరు వచ్చారు... ఒకరిని చూసి ఒకరు వెళ్లిపోయారు...
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట మున్సిపాలిటీలో మెల్లమెల్లగా రాజకీయ రగడ మొదలవుతుంది. సోమవారం ఉదయం 11.30 గంటలకు అధికారికంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని, అలాగే బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి మొదట పలువురు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హాజరుకాగా 11:30 అయితే కూడా సమావేశం ప్రారంభించరా అంటూ.... బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మాకు ఫంక్షన్లు ఉన్నాయని టైం అవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ తో చెబుతూ బయటకు వెళ్లిపోయారు.

అయితే సమయం 12 గంటలైనా బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఒక్కరూ కూడా రాకపోగా 12 తర్వాత బీజేపీ కౌన్సిలర్లు అనూష, జయ శ్రీ, శ్వేత కౌన్సిల్ హాల్లోకి ఇలా వచ్చి అలా బయటకు వెళ్లిపోయారు. వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టడ్ సైతం హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సలీం, మహేష్, సరిత, బీఆర్ఎస్ కౌన్సిలర్ అమీరుద్దీన్ తో పాటు ఓ మహిళా కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యుడు హాజరైనప్పటికీ చివరకు కమిషనర్ సునీత మాట్లాడుతూ కోరం లేనందున బడ్జెట్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఇలా పలువురు కౌన్సిల్ సభ్యులు సమావేశానికి వచ్చి వెళ్లిపోవడం వెనక గల రాజకీయ అంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed