పోలీస్ శాఖ విధులు అత్యంత బాధ్యతయుతమైనవి, అంకితభావంతో పని చేయాలి : ఎస్పీ

by Kalyani |
పోలీస్ శాఖ విధులు అత్యంత బాధ్యతయుతమైనవి, అంకితభావంతో  పని చేయాలి : ఎస్పీ
X

దిశ, నర్వ : నారాయణ పేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్​ మంగళవారం ఉదయం నర్వ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారానికోసారి శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ విధులు నిర్వర్తించే సమయంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, యూనిఫామ్ నిట్ టర్న్ అవుట్ కలిగి ఉండాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని, ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఆఫీసులో నన్ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డ్స్ ని పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్ఐ, సీఐ లను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో రోజువారిగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ అత్యంత బాధ్యతాయుతమైన వ్యవస్థ అని, విధుల పట్ల అంకితభావం గా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని, ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోలీసు స్టేషన్ పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దొంగతనాల నిర్మూలన కొరకు నిఘా ఏర్పాటు చేయాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

రహదారి వెంట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలి అని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై, 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తీసుకొచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రతా, భరోసా కల్పించాలని సూచించారు.



Next Story