ప్రలోభాలకు గురి కావద్దు: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Disha web |
ప్రలోభాలకు గురి కావద్దు: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: రాజ్యాంగం ద్వారా అర్హులైనా ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిస్వార్థంగా ఓటును వేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఓటు వేస్తే నాకేంటి లాభం అని అనుకోవద్దని సమాజంలో ఏదైనా మార్పును కోరుకునే వారు ఆ మార్పు జరగాలంటే తన ఓటు ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాలన్నారు. అనంతరం సీనియర్ ఓటర్లు నర్సింహులు, మాండ్రే, బుగ్గప్ప, మన్నే వెంకటరాములు, బస్వరాజ్ లను శాలువా, పూలమాలలతో సత్కరించారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి ఏపీక్ కార్డులను అందించారు. ఓటర్ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి కృష్ణమాచారి, తహసీల్దార్ దానయ్య, జడ్పీ సిఈఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed