ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఓటేయొద్దు : ఆకునూరి మురళి

by Kalyani |
ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలకు  ఓటేయొద్దు : ఆకునూరి మురళి
X

దిశ, మక్తల్ : మేనిఫెస్టో లో పొందుపరచిన ఏ ఒక్క హామీని బీజేపీ,బీఅర్ఎస్ పార్టీలు నెరవేర్చలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదికల ఉమ్మడి కమిటీ కన్వీనర్ మాజీ ఐ ఏ ఎస్ అధికారి,ఆకునూరి మురళి అన్నారు. మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ సమావేశంలో మాజీ ఐ ఏ ఎస్ అధికారి,ఆకునూరి మురళి, ప్రొఫెసర్ వినాయక రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర 20 వ రోజు మక్తల్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో 88 రోజులు జాగో తెలంగాణ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర 84 వ రోజు ఓటర్లలో ఓటు హక్కు విలువలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఫల్యాలను ఎత్తిచూపారు.భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో గత పదేళ్లుగా పాలననందిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పెట్టుబడిదారీ వ్యవస్థను, వ్యక్తులను ప్రోత్సహిస్తూ.. పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురించేస్తు న్నాయన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు ఇస్తానన్నా దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యా వైద్య రంగాలను సామాన్య ప్రజలకు దూరం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోఫెసర్ లక్ష్మి నారాయణ, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, నైనాల గోవర్ధన్, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు యం.కృష్ణ,హనుమేష్,ఎస్ ఎల్ పద్మ ,డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రామకృష్ణ, పులి కల్పన ,నిర్మల.కిరణ్,సంధ్య. భగవంత్, ఈశ్వర్,సౌజన్య,,గౌస్,బాలు,రాము,సారన్న,వినయ్, పాల్గొన్నారు.Next Story

Most Viewed