ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన వారికి వెంటనే ఆధార్.. ఫేక్ కార్డులపై మరింత ఫోకస్!

by Dishanational4 |
ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన వారికి వెంటనే ఆధార్.. ఫేక్ కార్డులపై మరింత ఫోకస్!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: డూప్లికేట్ ఆధార్ కార్డు ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీకి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల లబ్ది కొరకు జన్మ తేదీని ఇష్టానుసారం మార్చడం, డూప్లికేట్ ఆధార్ కార్డులు సృష్టించడం వంటివి జరుగుతాయని వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలని సభ్యులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన బిడ్డకు అక్కడే ఆధార్ కార్డు జారీ చేసే విధంగా ఏర్పాట్లు ఉంటాయని.. ప్రైవేటు ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా బయట చేయించుకోవచ్చాని తెలిపారు.

5 ఏళ్ల వయస్సు పిల్లలకు బయోమెట్రిక్ ఉండవు కాబట్టి 5 ఏళ్ల తర్వాత పిల్లలకు పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అప్డేషన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. అన్ని ఆధార్ సెంటర్లు ప్రభుత్వ స్థలాల్లోనే ఉండే విధంగా చూడాలని సూచించారు. కార్డు పొంది 10 ఏళ్లు దాటిన వారు ఖచ్చితంగా ఆధార్‌ను అప్డేషన్ చేయించుకోవాలని, ఇందుకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించాలని అన్నారు. తెలకపల్లి, తాడూర్ మండలంలో ఆధార్ సెంటర్ పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈడీయంను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఈఓ గోవింద రాజులు, డీఎస్పీ మోహన్, డీడబ్ల్యూఓ వెంకటలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, పోస్టల్ డిపార్ట్మెంట్, ఈడీయం కలెక్టరేట్ మీ సేవా సెక్షన్ సూపరిండెంట్ బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed