ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం

by Disha Web Desk 12 |
ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం
X

దిశ ప్రతినిధి నాగర్ కర్నూల్: ఒకే ఇంట్లో ఇద్దరు మైనర్ బాలికలు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మేకల లక్ష్మమ్మ బాలరాజులకు మేకల భాగ్యమ్మ(16), మేకల మైనావతి (13) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 20న మేకలు కాసేందుకు వెళ్లి తిరిగిరాలేదు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు ఇద్దరు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.. స్థానికుల సాయంతో చికిత్స అనంతరం కోలుకొని తమ పిల్లల ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గతంలోని తన కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయామని ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు కూడా తప్పిపోవడం, వారు మైనర్లు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.


Next Story

Most Viewed