జోగులాంబ తెప్పోత్సవం కమనీయం.. తరలివచ్చిన భక్తజనం

by Disha Web Desk 21 |
జోగులాంబ తెప్పోత్సవం కమనీయం.. తరలివచ్చిన భక్తజనం
X

దిశ, అలంపూర్ : తుంగభద్ర నదీమ తల్లి నీటి సవ్వడులు.. విద్యుద్దీపాల వెలుగులు.. బోటులో కొలువుదీరిన దేవతామూర్తులు.. చుట్టూ తరలివచ్చిన భక్తజనం నడుమ జోగులాంబ తెప్పోత్సవం కనులపండువగా సాగింది. అలంపూర్ పుణ్యక్షేత్రంలో తొమ్మిది రోజులుగా కొనసాగిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం విజయదశమితో విజయవంతంగా ముగిశాయి. తుంగభద్రానదిలో నిర్వహించిన తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో పుష్కరఘాట్ పులకరించింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య. దంపతులు, అలంపూర్ సివిల్ జడ్జి కవిత దంపతులు, డీఎస్పీ రంగస్వామి హాజరయ్యారు. ఈఓ పురెండర్ కుమార్, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పూర్ణాహుతి సమర్పించారు. శమీ వృక్షానికి పూజలు చేసి ఆయుధ పూజలు నిర్వహించారు. అంతకు ముందు అమ్మవారికి పుణ్యజలాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విగ్రహాలను నదిలోకి తీసుకెళ్లి పుణ్యస్నానాలు చేయిస్తూ తీర్ధావళి నిర్వహించారు.

జోగుళాంబ అమ్మవారి తెప్పోత్సవాన్ని తుంగభద్రలో నిర్వహించారు. అంతకు ముందు తుంగభద్ర నదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవ తామూర్తుల విగ్రహాలను బోటులో ఉంచి పుష్కర ఘాట్ మీద నుంచి వేదపండితులు తుంగభద్ర నదికి దశవిదహారతులు ఇచ్చారు. చివరిగా ఆలయంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు.


Next Story

Most Viewed