కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి : మిథున్ రెడ్డి

by Kalyani |
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి : మిథున్ రెడ్డి
X

దిశ,హన్వాడ : అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. శనివారం హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక మచ్చలేని నాయకుడి పెంపకంలో పెరిగి పాలమూరు యువత ఆశయాలు సాధించుకునేందుకు నరేంద్ర మోడీ పంపిన ప్రతినిధిగా మీ ముందుకు వచ్చా అని పేర్కొన్నారు. మీరు ఆశీర్వదించి పాలమూరు అభివృద్ధికి అవకాశం కల్పించాలన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఓటేసి గెలిపించాలని ప్రజలను మిథున్ రెడ్డి కోరారు.

వేపూర్, లింగన్న పల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మిథున్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీలకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రం నిధులిస్తే ఆ నిధులనుకూడా ముఖ్యమంత్రి లాక్కున్నాడని ఆరోపించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు ఇంకా ఎన్నో గ్రామాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే తామే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని మిథున్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టి యువత ను తాగుబోతులుగా మారుస్తున్నారని ఆరోపించారు. లింగన్న పల్లి గ్రామంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి మిథున్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పడాకుల బాల్ రాజ్,అంజయ్య, మండల అధ్యక్షుడు డాక్టర్ వెంకటయ్య, మండల నాయకులు లింగం, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed