ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు అయ్యేలా చూడాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Disha Web Desk 11 |
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు అయ్యేలా చూడాలి:  కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అయ్యేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని జాజాపూర్, బొమ్మన్ పాడ్ పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేసి మన ఊరు మనబడి లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం కోటకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పర్యటించి రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రిలో ఎన్ని కాన్పులు జరుగుతున్నాయని.. ఈ నెలలో ఎన్ని జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రిజిస్టర్ లో నమోదు చేసి రిపోర్టులు పంపాలన్నారు. ఎక్కువ శాతం ఆస్పత్రులలోనే కాన్పులు జరిగేలా నార్మల్ డెలివరీ చేయాలన్నారు. గర్భిణిల ఇండ్లకు వెళ్లి బీపీ షుగర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కాన్పులు అయ్యాక బాలింతలకు టీకాలు ఇతర పరీక్షలు నిర్వహించాలన్నారు.



Next Story

Most Viewed