దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి జింక

by Aamani |
దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి జింక
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం ,కీమ్యా తండా గ్రామ పంచాయితీలోకి దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన జింకను ఊర కుక్కలు వేటాడి గాయపరిచాయని తండావాసులు తెలిపారు. ముందే వేసవి కాలం కావడంతో జింకలకు నీళ్లు దొరకకపోవడంతో జనావాసాలలోకి రావడంతో ఊర కుక్కలు వాటిని వేటాడి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయని తండావాసులు తెలిపారు. ఫారెస్ట్ లో దాహార్తి తీర్చుకునేందుకు నీరు దొరకకపోవడం తోనే తండాలోకి జింకలు వస్తున్నాయని వారు తెలిపారు. జనావాసాల్లోకి వచ్చిన జింకలను ఊర కుక్కలు వేటాడి గాయపరచడంతో గమనించిన స్థానికులు కుక్కల నుంచి తప్పించి జింకను గాయపరచడం తో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని తండా వాసులు తెలిపారు.

Next Story

Most Viewed