Kinnera Mogilaiah: పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. దర్శనం మొగులయ్య సంచలన వ్యాఖ్యలు(వీడియో)

by Disha Web |
Kinnera Mogilaiah: పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. దర్శనం మొగులయ్య సంచలన వ్యాఖ్యలు(వీడియో)
X

Kinnera Mogilaiah says that padma shri will be given back

దిశ, అచ్చంపేట : దేశంలోనే అరుదైన కళాకారుడిగా 12 మెట్ల దర్శనం మొగులయ్య(Darshanam Mogilaiah) పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రాజకీయ కుట్రలతో తన పొట్ట కొట్టే కుట్రలు, కుయుక్తులు జరుగుతున్నాయి. ఒక అమాయకుడిని అన్యాయంగా రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని దాన్ని రాజకీయ వ్యభిచారంగా భావించవచ్చని నాగర్ కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం స్థానిక బీజేపీ నాయకులు మొగిలయ్యతో మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో పద్మశ్రీ మొగులయ్య బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వమే నా కలను గుర్తించింది..

నాతోనే అంతరించిపోతున్న 12 మెట్ల కిన్నెర(Kinnera)కు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ స్థానిక శాసన సభ్యుడు గువ్వల బాలరాజు(Guvvala Balaraju) ద్వారానే భారత దేశంతో పాటు ఇతర ఖండాంతరాల్లో దర్శనం మొగులయ్య పేరు ప్రఖ్యాతలు వ్యాప్తి చెందాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ గుర్తింపుతోనే నాకు పద్మశ్రీ అవార్డు రావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

బీజేపీ నేతలు కావాలనే..

స్థానిక బీజేపీ నేతలు రాజకీయ కుట్ర తోనే కిన్నెర మొగులయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) అన్యాయం చేశారని తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక సామాన్యుడికి రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చి దేశం గర్వపడేలా చేసిన ఈ ప్రభుత్వాన్ని అవసరంగా బదనాం చేసే తప్పుడు విధానాన్ని బీజేపీ నాయకులకు తగదని వారిపై మండిపడ్డారు.

ఆ కోటి బీజేపీ నాయకులు ఇస్తారా..

దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు కోటి నజరానా, హైదరాబాదులో ఇంటి స్థలం ప్రకటించిన విషయం విదితమే. దర్శనం మొగులయ్యకు ప్రభుత్వం ప్రకటించిన కోటి నజరానా ఇవ్వకుండా మోసం చేసిందని తప్పుడు ప్రచారాన్ని చేయడం మనోవేదనకు గురి చేసిందని మొగులయ్య అభిప్రాయపడ్డారు. ఆ వీడియో వైరల్ అనంతరం ఆయన బీజేపీ నాయకులను ఆ కోటి బీజేపీ నాయకులు ఇస్తారా అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు.. నాలాంటి సామాన్యుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వారి తప్పుడు విధానానికి నిదర్శనం అన్నారు.

పద్మశ్రీ తిరిగి ఇస్తా..

బీజేపీ నాయకులు అనవసరంగా వివాదాల్లోకి లాగడంతో పద్మశ్రీ(Padma Shri) అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య ఈ అవార్డు నాకు అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇస్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన స్థానిక బీజేపీ నాయకులపై పరువు నష్టం దావా వేస్తా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story