జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం..

by Disha Web Desk 13 |
జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం..
X

దిశ, జడ్చర్ల: ఎలాంటి అనుమతులు లేని లక్షల రూపాయల విలువైన పేలుడు పదార్థాలను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడ్డాయి. సుమారు 10 లక్షల విలువైన 2,500 డిటోనేటర్లు, 2,750 జిలేటేన్స్ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. వడ్డే బాలయ్య అనే వ్యక్తి తన కంప్రెషన్‌తో గుట్టలను బండరాలను పేల్చేందుకు రాజేష్ అనే మధ్యవర్తి ద్వారా ఈ పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకోవడం తో పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీన పరుచుకున్నారు.


పట్టుపడ్డ పేలుడు పదార్థాలను స్థానిక పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించి సంబంధిత ఘటనపై కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నర్సింలు గౌడ్.. జడ్చర్ల సీఐ రమేష్ బాబు కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పట్టణంలో ఇలాంటివి ఇంకేమైనా ఉంటే తనిఖీలు చేసి వాటిని నిర్వహిస్తున్న యజమానులను బైండవర్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story