కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. చీకట్లోనే మక్తల్ తాసిల్దార్ కార్యాలయం..

by Disha Web Desk 11 |
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. చీకట్లోనే మక్తల్ తాసిల్దార్ కార్యాలయం..
X

దిశ, మక్తల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా మక్తల్ తాసిల్దార్ కార్యాలయం ముస్తాబు చేయకపోవడంతో చీకట్లో మగ్గుతుంది. ఉత్సవాలపై రెండు రోజుల క్రితమే కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేసి ఉత్సవాలను ఘనంగా జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే మేజిస్ట్రేట్ పవర్ కలిగిన మక్తల్ తాసిల్దార్ కార్యాలయం నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని కార్యాలయాలకు ఆదర్శంగా ఉండేలా ముస్తాబు చేయకుండా చీకట్లోనే ఉంచారు. కాగా అధికారులు కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతర్ చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed