చిన్నారి మధుర ను అభినందించిన కలెక్టర్..

by Disha Web Desk 11 |
చిన్నారి మధుర ను అభినందించిన కలెక్టర్..
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని చిన్నదర్పల్లికి చెందిన రెండేళ్ళ 7 నెలల వయసు ఉన్న చిన్నారి ఓరుగంటి మధుర ను జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంత చిన్న వయసులోనే 11 జంతువులు, 8 పండ్లు, 10 పక్షులు, 7 వాహనాలు, 5 ఆకారాలు, 5 జాతీయ సింబల్స్,14 రాష్ట్రాలు, వాటి రాజధానులు, 3 రైమ్స్ తదితరం ఏకబిగిన కంఠస్తం చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేసి మరింత జ్ఞానాన్ని పెంపొందించేలా కృషి చేయాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సిఈఓ జ్యోతి, ఆర్డీఓ అనీల్ కుమార్, డీఆర్డీఓ యాదయ్య, సాంఘీక సంక్షేమాదికారి మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed