నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

by Disha Web Desk 13 |
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన సీఎం కేసీఆర్.. వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లీకేజీ వ్యవహారంలో ఇప్పటికి ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పరీక్షలు డబ్బున్న వ్యక్తులకే ఉద్యోగాలు కల్పించేలా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే.. కేసీఆర్ తన కూతుర్ని లిక్కర్ స్కాం నుండి కాపాడుకునే పనిలో నిమగ్నం అయ్యారని మండిపడ్డారు.

చేతగాని ముఖ్యమంత్రి ని ఎన్నుకోవడం ప్రజల దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీతో తీవ్రంగా నష్టపోతున్న నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 5,000 చొప్పున పరిహారం గా ఇవ్వాలని.. అనంతరం నిర్వహించే పరీక్షలు ఉచితంగానే జరపాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో తెలకపల్లి జడ్పిటిసి సుమిత్ర, రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి అద్దం రవి తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed