- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఔరా అనేలా చంద్రయాన్-3 వినాయకుడు

దిశ, జడ్చర్ల : వినాయక చవితి ఉత్సవాలు అంటే జోష్ అంతా ఇంకా కాదు ఇక గణేశుడు విగ్రహాలు మండపాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. డబ్బులతో మండపాలను అలంకరిస్తుంటారు. టీ కప్పులతో వినాయకుడిని చేస్తుంటారు. మండపాన్ని సినిమా సెట్ లా తయారు చేస్తుంటారు. ఇలాంటి వింతలు విశేషాలు బాగానే జరుగుతాయి. ఈ కోణంలోనే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు వీర శివాజీ నగర్ కాలనీకి చెందిన కాలనీవాసులు వినూత్న ఆలోచనతో పట్టణ ప్రజల దృష్టిని తమ వినాయకుడి వైపు మరలిచారు. ఇటీవలే చంద్రయాన్ -3 ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దృష్టిని భారత్ వైపు మరచిన విషయం తెలిసిందే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వినాయక చవితి సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ కాలనీలో చంద్రయాన్ 3 రాకెట్ రూపొందించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ఔరా అనిపించారు.
అయితే ఈ విషయం తెలిసిన పట్టణ ప్రజలు భారీగా వీర శివాజీ నగర్ కాలనీకి చేరుకొని చంద్రాయన్ -3 వినాయకుడిని చూసేందుకు వస్తున్నారు. కాగా భారీ రాకెట్ మండపం పూర్తిగా ముస్తాబు కావడానికి ఈ రాత్రికి ఇంకాస్త సమయం పడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్- 3 రూపొందించి విజయవంతంగా లాంచ్ చేసి ప్రపంచంలో గర్వంగా తలెత్తుకు నిలిచేలా చేసిన శాస్త్రవేత్తల శ్రమను సామాన్య ప్రజలకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతోనే నేడు చంద్రయాన్ 3 రూపంలో వినాయకుడిని ప్రతిష్టించామని జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ కాలనీ వినాయక కమిటీ సభ్యులు తెలిపారు. చంద్రయాన్ 3 వినాయకుడి నిర్వహణకు సుమారు 3 లక్షల రూపాయల ఖర్చు చేశామని రాజు, కుమార్, వెంకటేష్, నరేష్, కిషోర్, చంద్రకాంత్ వేణుగోపాల్, కరీం వినాయక మండప నిర్వహకులు తెలిపారు.