మండలంలో బీఆర్ఎస్ సంబరాలు

by Disha Web Desk 21 |
మండలంలో బీఆర్ఎస్ సంబరాలు
X

దిశ, కొత్తపల్లి, మద్దూరు: ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును హర్షిస్తూ మండలంలో పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. మద్దూరు, కొత్తపల్లి గ్రామాల్లో పార్టీ నాయకులు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచి పెట్టారు. దేశంలో ప్రజల సమస్యల్ని కేసీఆర్ మాత్రమే పరిష్కరిస్తారని నాయకులు తెలిపారు. రాష్ర్టంలో అమలు చేస్తున్న పతకాలను దేశంలో ఆదర్శంగా మారనున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అధికార పార్టీ చేస్తున్న మత పరమైన రాజకీయాలను అడ్డుకొనే వ్యక్తి కేసీఆర్. ఆయన నీడలో ఉన్న కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు, సర్పంచ్‌లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసుదన్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Next Story