కాంగ్రెస్ నేత గట్టు వెంకటరెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ నేత గట్టు వెంకటరెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
X

దిశ, మహబూబ్ నగర్ : కాంగ్రెస్ నాయకుడు, మాజీ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డి పై శనివారం బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని దాడికి కారకులైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్, ఇతర కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, జడ్చర్ల-మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు శ్రీనివాస కాలనీ ఓ కిరాణ దుకాణం వద్ద ఉన్న వెంకట్ రెడ్డి పై కార్యకర్తలు దాడులు చేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పలువురు డిమాండ్ చేశారు. ఈ ధర్నా తో దాదాపుగా గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు డీఎస్పీ, తదితర పోలీస్ అధికారులు చేరుకుని దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన ముగిసింది.

Next Story