బహుజన బిడ్డను ఆశీర్వదించండి..

by Disha Web Desk 11 |
బహుజన బిడ్డను ఆశీర్వదించండి..
X

దిశ, గద్వాల ప్రతినిధి : గద్వాల నియోజకవర్గ చరిత్ర లో తొలిసారిగా బహుజన బిడ్డ మహిళ పోటీ చేయబోతోందని, ఈ పోటీ చేయడం కొంత మందికి నచ్చడం లేదని ఏది ఏమైనా గద్వాల నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత తిరుపతయ్య ఆదివారం రాత్రి గద్వాల పట్టణంలో నీ జమ్మి చెడు వీధి లోని 4, 5 వార్డ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలు ఆమెకు ఘజ మాలతో స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాలకుల అసమర్థ తో గద్వాల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 4000/- రూపాయల పెన్షన్, ఒకేసారి రెండు లక్షల రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా కింద రైతులకు 15000 ఎకరానికి, కౌలు రైతులకు 12000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తుందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజిపేట్ శంకర్, మధుసూదన్ బాబు, బండారి భాస్కర్,టిజెఎస్ ఆలూరు ప్రకాష్ గౌడ్, సిపిఐ ఆంజనేయులు, నాగేంద్ర యాదవ్, తుమ్మల నరసింహ, ఆనంద్, రాము, సురేష్, నాగరాజు, వెంకటన్న, వెంకటేష్, వెంకట్, రవి , ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు, తదితరులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story