సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతి

by Disha Web Desk 11 |
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతి ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవడం రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. జాతీయ నేత బంగారు లక్ష్మణ్ వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బంగారు శృతి గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసి 13 శాతం ఓట్లను సాధించగలిగారు. ఈ ఎన్నికలలోను ఆమె టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ కు టికెట్ కేటాయించింది. దీంతో ఆమె హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed