గద్వాల ఫలితాలపై భారీగా బెట్టింగులు

by Disha Web Desk 11 |
గద్వాల ఫలితాలపై భారీగా బెట్టింగులు
X

దిశ, బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా ఉండడంతో పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య జరిగిన పోటీ ఆసక్తికరంగా మారింది. గెలుపు మాది అంటే.. మాదే అని ఎవరికివారుగా అంచనాలు వేసుకుంటున్నారు. ఇరువురి తరపున పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరు లక్ష రూపాయలు మొదలుకొని కోటి రూపాయల వరకు బెట్టింగులు వేసుకుంటున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారాలు వందల సంఖ్యలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మరి కొంతమంది పొలాలను బెట్టింగులుగా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బెట్టింగ్ ల వ్యవహారము జోరు అందుకోవడంతో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశం అయ్యింది.

Next Story

Most Viewed