- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విలువైన సమయంతో ఉత్తమ ఫలితాలు సాధించాలి : ఎమ్మెల్యే యెన్నం

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.పట్టణంలోని మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్,ఫాతిమా విద్యాలయ,క్రీస్తు జ్యోతి,శ్రీ అక్షర,గెలాక్సీ పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులకు ఆయన ఆత్మీయ కానుకగా 2 డి,3 డి యానిమేషన్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను తన సొంత నిధులతో ఉచితంగా అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందించడంతో 10 తరగతి పరీక్షలో 23 శాతం అధికంగా ఫలితాలు వచ్చాయని,ఈ సంవత్సరం వార్షిక పరీక్షలకు 45 రోజుల సమయం ఉందని,ప్రతి క్షణం కూడా చాలా విలువైనదని,ప్రతి ఒక్కరూ విలువైన ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉపయోగించుకొని 10 వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.
ఈ మెటీరియల్స్ మహబూబ్ నగర్ లో తప్ప ఎక్కడా అందుబాటులో లేవని ఇవి కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని,తెలంగాణ రాష్ట్ర సిలబస్ మాత్రమే ఉంటుందని ఈ స్టడీ మెటీరియల్ చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లు శాంత,ట్రేసా,శ్రీనివాసులు,భాను ప్రకాష్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,కిరణ్,కృష్ణకాంత్ రెడ్డి,రఘు,రఘు,మాజీ కౌన్సిలర్లు ప్రశాంత్,చిన్న,తిరుమల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.