స్వార్థ రాజకీయాలు కోసం సొంత పార్టీ నేతలకు వెన్నుపోటు : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 23 |
స్వార్థ రాజకీయాలు కోసం సొంత పార్టీ నేతలకు వెన్నుపోటు : వంశీచంద్ రెడ్డి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి జాతీయ ఉపాధ్యక్షురాలు గా ఉండి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు తీసుకరాలేదని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ లతో కలిసి ప్రసంగించారు.బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కు ఓటు వేస్తే తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాన్ని అమ్మెస్తుందే తప్ప,పాలమూరు అభివృద్ధి కోసం పని చేయదని,ఇప్పుడు గద్వాల్ పరిస్థితి అట్లాగే తయారయ్యిందని ఆయన తీవ్రంగా విమర్శించాడు.

సొంత ప్రయోజనాల కోసం అక్రమ దోపిడీలను,అనైతిక వ్యాపారాలను విచ్చలవిడిగా చేసేందుకే గద్వాల,మక్తల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బలహీనవర్గాల బిడ్డలను ఓటమి పాలు చేసేందుకు సొంత పార్టీ నాయకులను ఓడించి,వెన్నుపోటు పొడిచిన ఘన కీర్తి ఆమెదే అని ఎద్దేవా చేశారు.ఇంత ఘన చరిత్ర కలిగిన డీకె.అరుణకు ఓటు వేశారో తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తనను మహబూబ్ నగర్ ఎంపీ గెలిపించి ఆత్మగౌరవాన్ని,పాలమూరు ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలిచేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో టిపిసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్,వినోద్ కుమార్,హర్షవర్థన్ రెడ్డి,జహీర్ అక్తర్,ఏపి.మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed