గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..

by Disha Web Desk 20 |
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : స్వచ్ఛ సర్వేక్షన్ ద్వారా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీఒలు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. 15 గ్రామపంచాయతీలు ఎంపిక చేసి ఆ పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

గ్రూప్ -4 పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి..

జులై 1వ తేదీన నారాయణపేట జిల్లా పరిధిలో జరగనున్న గ్రూప్ -4 పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అధికారులకు ఆదేశించారు. గ్రూప్-4 పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు చేశారు. జిల్లాలో 7324 మంది అభ్యర్థులు 28 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనకు లోబడి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని డీఎస్పీకి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, ఆర్టీవో వీరాస్వామి, డీఈవో రియాజ్ హుస్సేన్, డీపీఆర్ఓ రషీద్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed