దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు..

by Disha Web |
దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు..
X

దిశ,అమరచింత: ఈ నెల 26న దళితులపై దాడికి పాల్పడిన సర్పంచ్ భర్త, అతని అనుచరులైన 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. పుట్టా మహేష్ తెలిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల గ్రామంలో రిపబ్లిక్ డే రోజు డ్రైనేజీ తగాదాలో సర్పంచ్ భర్త మశ్చందర్ గౌడ్ ఆయన అనుచరులు దళితులమైన తమపై దాడి చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్.ఐ వెల్లడించారు. అదేవిదంగా అంతకు ముందు మహిళలపై దాడి చేశారన్న సర్పంచ్ భర్త, అనుచరుల ఫిర్యాదుతో ఇరు వర్గాలపై కేసులు చేసినట్లు ఆయన తెలిపారు.




Next Story

Most Viewed