సీఎం రేవంత్ జనరంజక పాలన తో మరో ఐదేళ్లు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
సీఎం రేవంత్ జనరంజక పాలన తో మరో ఐదేళ్లు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరో ఐదేళ్లు జనరంజక పాలన అందిస్తాడని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు అమలు పరుస్తూ, ఎన్నికల మేనిఫెస్టో లోని హామీలన్నీ దశలవారిగా పరిష్కరిస్తూ, నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గం లో ఇక నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు రావచ్చని, అందరికి అందుబాటులో ఉండే ప్రజా సేవకుడినని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పని చేస్తానని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed