పడమటి అంజన్న తిరునాళ్ల పారిశుద్ధ్య పనుల్లో.. మున్సిపల్, పాలక మండలి కమీషనర్ల మధ్య వాగ్వాదం

by Disha Web Desk 6 |
పడమటి అంజన్న తిరునాళ్ల పారిశుద్ధ్య పనుల్లో.. మున్సిపల్, పాలక మండలి కమీషనర్ల మధ్య వాగ్వాదం
X

దిశ, మక్తల్: మక్తల్ పడమటి అంజన్న స్వామి తిరుణాలకు సంబంధించి న పారిశుద్ధ పనులు చేయడంలో మున్సిపల్ కమిషనర్, పాలకమండలి మధ్యన వివాదమై కూర్చుంది. చీటికిమాటికి తనతో వివాదం పెట్టుకుంటే నేను బదిలీపై వెళ్తానని పాలక మండలితో కమిషనర్ అన్నట్టు సమాచారం. సోమవారం నుండి పడమటి అంజన్న తిరునాళ్లు ప్రారంభముతుండగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్న స్థలంలో వీరిద్దరూ మాటామాట అనుకోవడంపై పలువురిని ఆశ్చర్యపరిచింది. తిరుణాలకు సంబంధించిన పారిశుద్ధ్య పనులు మనం చేయాలని పాలక మండలి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే ఇది ఎండోమెంట్ వాళ్ళు చూసుకుంటారు. డబ్బుల ఖర్చు మనకెందుకు అంటు దానికి సంబంధించిన బిల్లులు నేను చేయనని ఇరువురు మధ్యన వాగ్వాదం జరిగిందని సమాచారం.

ఎక్కడైన ఉత్సవాలు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పారిశుద్ధ పనులు చేయాల్సిన బాధ్యత మున్సిపా లిటీపై ఉంటుంది. అయితే పడమటి ఆంజనేయస్వామికి ఉన్న స్థలంలో తిరునాళ్లలో ఆట వస్తువులు, తిను బండారాలు, అమ్మెందుకు గాను వెలిసిన గుడారాల ద్వారా ఒక్కొక్క దుకాణం నుండి రూ. 10 వేలచొప్పున లక్షలాది రూపాయలను మున్సిపల్ కాంట్రాక్టర్ వసూలు చేస్తాడు. ఇలా వసూలు చేసిన దాంట్లో పదిశాతం కూడా మున్సిపాలిటీకి చెల్లించడని ఇందులో అధికార పార్టీ క్రింది స్థాయి నాయకులు జోక్యం చేసుకొంటారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్యం పాలకమండలి కమిషనర్ మధ్యన బేదాభి ప్రాయాలు రావడం ఇలాగే ఉంటే నేను ఇక్కడ నుంచి బదిలీ చేసుకొని వెళ్తానని అన్నట్టుగా సమాచారం. ప్రధానంగా పడమట ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఇందుకు గాను పట్టణాలు ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. అందుకుగాను మొత్తం మున్సిపాలిటీలో తిరునాళ్ళు జరిగే ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగకుంటే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటుపడమటి అంజన్న తిరునాళ్ల పారిశుద్ధ్య పనుల్లో.. మున్సిపల్ కమిషనర్‌కు, పాలక మండలికి వాగ్వాదంన్నారు.


Next Story

Most Viewed