తెలంగాణలో అసమర్థత పాలన నడుస్తోంది : ఆకునూరి మురళి

by Disha Web Desk 11 |
తెలంగాణలో అసమర్థత పాలన నడుస్తోంది : ఆకునూరి మురళి
X

దిశ, గద్వాల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటు వేయకుండా చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలిపారు. సోమవారం ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, దోపిడీ నడుస్తుందని అది కేవలం కేసీఆర్ కుటుంబమే అని అన్నారు. రాష్ట్రంలో 9 సంవత్సరాల కొనసాగించిన పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా నీరుగార్చారని, తెలంగాణ కోసం ఎంతోమందిప్రాణత్యాగం చేశారని, అలాంటి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని కేవలం కేసీఆర్ కుటుంబమే పదవులు అనుభవించారని, విద్య, వైద్యం, అభివృద్ధి లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసమర్థత పాలన కొనసాగుతోందని అన్నారు.

గద్వాల నియోజకవర్గంలో నీతి, నిజాయితీతో పోరాటం చేస్తున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ఏ ఐ ఎఫ్ బీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ కు పూర్తి మద్దతు తెల్పుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, కార్యదర్శి రాము, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, కార్యదర్శి తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.

Next Story