అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి

by Naveena |
అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బాబా సాహెబ్ బిఆర్.అంబేడ్కర్ ఆశయాలను మనందరం నేరవేర్చాలని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కోరారు. శుక్రవారం ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా,భారత రాజ్యాంగ నిర్మాత,రాజకీయనేత,ఆర్థిక వేత్త,సంఘ సంస్కర్తగా దేశానికి అనేక సేవలందించి,అంటరానితనం,కులనిర్మూలన కోసం పోరాడిన మహానీయుడన్నారు.ఈ కార్యక్రమంలో ఇమ్మానియేల్,మధుసూదన్ శర్మ,కేశవర్షన్ గౌడ్,ఉషాలక్ష్మీ,జగదీశ్వరి,అమీనా షరీప్,యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed