- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అలంపూర్ లోని భూములన్ని బంగారమే
దిశ అలంపూర్ : పాలమూరు ఉమ్మడి జిల్లాలోని ఎక్కడలేని విధంగా అలంపూర్ నియోజకవర్గంలోని భూములన్ని బంగారు భూములే అని, పంటలు వేసి పండించిన ప్రతి భూమి బంగారు భూములు మాదిరిగా దిగుబడులు వస్తాయని, రైతుకు ఎల్లవేళలా మా సహకారం ఉంటుందని ఉమ్మడి మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్l మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. డిసిసిబి చైర్మన్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జోగులాంబ గద్వాల జిల్లాలోని మానోపాడులోని సహకార సంఘం సొసైటీని ఆయన విజిట్ చేసినట్లు తెలిపారు. రైతుల కోసం ఎన్ని రుణాలైన, ఎలాంటి రుణమైన సహకార సంఘం సొసైటీ నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు చెల్లిస్తే మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా రైతులకు అందించే క్రాప్ లోన్స్, ఎల్టి రుణాలు, కర్షక మిత్ర పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు ప్రతి రైతుకు అందజేస్తామన్నారు. హార్వెస్టర్లు, రోటవేటర్స్, ఎలాంటి మిషనరీ అయినా రైతులకు ఉపయోగపడేది ఉంటే సహకార సంఘం నుండి అందించడానికి సంసిద్ధమన్నారు. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సహకార సంఘం నుండి పంట భూములను బాగు చేసుకుని అధిక లాభాలు దిగుబడులు పొందాలని కోరిక ఎప్పటి నుంచో ఉందని ఆయన అన్నారు. అనంతరం మానోపాడు సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు, జిల్లా డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలను, రైతులకు ఏమేమి కావాలో అడిగి తెలుసుకున్నారు.
ఆ రైతుకు న్యాయం చేస్తాం... గత మూడు రోజుల క్రితం మానవపాడు సొసైటీ కార్యాలయం కు తాళం వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి సహకార సొసైటీ ద్వారా వేలం వేసిన భూమిని మానోపాడు రైతు సాయిబాబా దక్కించుకున్న విషయం వాస్తవమే అన్నారు. ఆ రైతుకు సహకార సంఘం నుండి సపోర్టు ఉంటుందని, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ రైతుకు వారం రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. కార్యాలయాలకు తాళం వేయడంతో మిగతా రైతుల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పరిష్కరించే మార్గాన్ని వెతుక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ రంగారెడ్డి, మానోపాడు సహకార సొసైటీ డైరెక్టర్లు, నాయకులు అయ్యన్న, కాంతారెడ్డి, వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.