బాధిత మహిళలను అన్ని వేళలా ఆదుకోవాలి: కలెక్టర్

by Disha web |
బాధిత మహిళలను అన్ని వేళలా ఆదుకోవాలి: కలెక్టర్
X

దిశ, నారాయణ పేట: సఖి కేంద్రానికి వచ్చే బాధిత మహిళలను అన్ని వేళలా ఆదుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష నిర్వాహకులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న సఖి కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించి మాట్లాడుతూ సఖి కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు వాటిపై నిర్వహకులు తీసుకున్న చర్యలపై రికార్డులను పరిశీలించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 180 కేసులు నమోదైనట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మైనర్ బాలికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. గృహహింస కేసుల్లో కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా మహిళకు అవసరమైన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలన్నారు. కౌన్సెలింగ్ కి రాని మగవారి విషయంలో అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆయన పరిశీలించిన కొన్ని కేసుల్లో సఖి నిర్వాహకులు కేసును పోలీసులకు బదిలీ చేసినట్లు గమనించారు. ఆ తర్వాత కేసు ఏ విషయంగా పరిష్కారం అయిందనే విషయం నిర్వాహకుల వద్ద లభించలేదు. సఖి కేంద్రంలో నమోదైనా కేసును ఐసీపీఎస్ శాఖ వారు నిర్వహిస్తున్న ఫైల్ తో కూడా సరిచేసి చూశారు. పిల్లలను స్టేట్ హోంకి పంపినా, బాలసదనంలో పెట్టినా వారి బాగోగులను చూడాలని, సఖి కేంద్రం నిర్వాహకులకు కౌన్సెలింగ్ నందు ఇంకా మెరుగైన శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.


Next Story