'కాంగ్రెస్ పార్టీ నేతల పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి'

by Sumithra |
కాంగ్రెస్ పార్టీ నేతల పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి
X

దిశ, గద్వాల ప్రతినిధి : సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కావాలనే హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా, రాహుల్ పేర్లు నమోదు చేసి ఛార్జ్ షీట్ వేశారని, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితా తిరుపతయ్య తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయం ముందు ధర్నా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక ప్రధాని మోడీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడి ఛార్జ్ షీట్ లో పేర్లు పెట్టి కక్ష, వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నామరూపాలు లేకుండా పోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువయి రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు. మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్సాక్, శంకర్, తిరుమల్, దౌలు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed