- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తూ టూరిస్ట్ బస్సు బోల్తా..
దిశ, పెబ్బేరు: పెబ్బేరు శివారు పరిధిలో నేషనల్ హైవే 44 పై శుక్రవారం ఉదయం టూరిస్ట్ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్ళడం తో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని 108 సహాయంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. పవిత్ర కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లా గురిచేరి గ్రామం నుండి జోగులాంబ గద్వాల జిల్లా లో పుణ్యక్షేత్రమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి టూరిస్ట్ బస్ ఏపీ 26 టిడి 5933 బస్సు లో దాదాపు 58 మంది యాత్రికులు బయలుదేరి వెళ్తుండగా శుక్రవారం వేకువజామున 6 గంటల పది నిమిషాల సమయంలో బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకు వెళ్లడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో ఆరు మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.