ఇంటర్ పరీక్షా కేంద్రంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని..

by Disha Web Desk 11 |
ఇంటర్ పరీక్షా కేంద్రంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని..
X

దిశ, మహబూబ్ నగర్: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థిని పరీక్షలు రాయడానికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో జరిగింది. బిందు అనే విద్యార్థిని గతంలో బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. ఈక్రమంలో కొన్ని సబ్జెక్టులను తప్పడంతో ఇప్పుడు పరీక్షలు రాస్తోంది. గురువారం ఉదయం పరీక్షా హాల్లోకి చేరింది. పరీక్షలు ఆరంభమైన కొద్దిసేపటికి ఆ విద్యార్థిని కి చెస్ట్ పెయిన్ రావడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందేమో అని సిబ్బంది భయపడ్డారు.

విషయాన్ని అక్కడే ఉన్న వైద్య సిబ్బందికి తెలియడంతో 108 కు సమాచారం ఇచ్చారు. ఆ లోపు డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు తన వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలోపు అంబులెన్స్ రావడంతో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్య అధికారులు విద్యార్థినికి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని బిందుకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. పరీక్షల సమయం కావడంతో నిద్రలేమి, ఒత్తిడి, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలవల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్లుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ తెలిపారు.

Next Story