గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి..

by Disha Web Desk 6 |
గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి..
X

దిశ, మక్తల్: గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో అంజప్ప(30) వ్యక్తి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన మక్తల్ మున్సిపల్ పరిధిలోని చందాపురం గ్రామ శివారులో జంగం కుంట దగ్గర గురువారం మధ్య రాత్రి చోటు చేసుకుంది. సున్నిత అవయవాలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని శుక్రవారం ఉదయం బాటసార్లు చూసి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మక్తల్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్య సిబ్బంది మెరుగైన చికిత్సకై పాలమూరు ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వే ళ్తే మాగనూరు మండలం వుడ్వాట్ గ్రామానికి చెందిన అంజప్ప భార్యాభర్తలు చందాపురం శివార్లో ఉన్న కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్నారని. గురువారం సాయంత్రం మద్యం తాగడానికి డబ్బుల విషయంలో భార్యతో గొడవపడి ఖానాపూర్ గ్రామంలో ఉన్న సోదరి ఇంటికి వెళ్లిన అంజప్ప గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గాయపడిన వ్యక్తిని మక్తల్ పోలీసులు పరిశీలించారు. అపస్మారక స్థితి నుండి తేరుకున్నాక వివరాలు తెల్సుకొని కేసు నమోదు చేస్తామని మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు.

Next Story