ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి

by Disha Web |
ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి
X

దిశ, జడ్చర్ల : విజయదశమి పండుగ సందర్భంగా ట్రాక్టర్‌ను కడగడానికి వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు (30) తన బంధువులకు సంబంధించిన ట్రాక్టర్‌ను చెరువులో కడగడానికి వెళ్లాడు.

అనంతరం ఆంజనేయులు చెరువులోని నీటి గుంటలో ప్రమాదవశత్తు మునిగి మృతి చెందాడు. పండగపూట గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలుఅలుముకున్నాయి. ఇక మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed