మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప..

by Disha Web Desk 11 |
మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప..
X

దిశ, మక్తల్: మక్తల్ మండలం పరిధి పసుపుల గ్రామం వద్ద కృష్ణా నదిలో సోమవారం మత్స్యకారులు వేసిన వలకు భారీ చేప చిక్కింది. ఉదయం నదిలో చేపల వేటకు వెళ్లిన పసుపుల గ్రామానికి చెందిన నరసింహకు ఏకంగా 30 కిలోల బొచ్చె రకం చేప వలలో చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కృష్ణా నదిలో భారీ చేపలు చిక్కడం తరచుగా జరుగుతుందని తెలిపారు. 30 కిలోల బొచ్చే రకం చేపకు మార్కెట్లో మంచి ధర పలికిందని సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed